GOOGLE CHAT: గూగుల్ చాట్ నేరస్థులకు ఓ కానుక: ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్

  • ప్రభుత్వ గూఢచర్యానికీ అవకాశం
  • ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ లేకపోవడం తిరోగమన చర్యే
  • మెస్సేజింగ్ యాప్స్ కు ఇది కనీస అవసరం
చాట్ పేరుతో మెస్సేజింగ్ యాప్ ను ఆవిష్కరించిన గూగుల్ విమర్శలను ఎదుర్కొంటోంది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ (పూర్తి రక్షణ) లేకుండా అందించే ఈ సేవలు నేరస్థులకు ఓ బహుమానమేనని ఆమ్నేస్టి ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది. అలాగే, ప్రభుత్వ గూఢచర్యానికీ ఇది చక్కగా పనికొస్తుందని పేర్కొంది. ఇది గూగుల్ కు తిరోగమన చర్య మాత్రమే కాదని, వాట్సాప్, ఐ మెస్సేజ్ లతో పోటీ పడలేదని కూడా అభిప్రాయపడింది.

ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ మెస్సెంజర్, యాపిల్ ఐ మెస్సేజ్ రెండు సేవలు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉన్నవే. మెస్సేసింగ్ యాప్స్ కు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉండడం తప్పనిసరి అవసరమని టెక్నాలజీ కంపెనీలకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గుర్తు చేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ సాంకేతికత ఉంటే సందేశాన్ని పంపిన వారు, అందుకున్న వారు మినహా మరెవరూ, చివరికి కంపెనీ కూడా చూడలేదు.
GOOGLE CHAT
AMNESTY INTERNATIONAL

More Telugu News