jaleel khan: మీరంతా జఫ్పాల మాదిరి మాట్లాడుతున్నారు: జలీల్ ఖాన్

  • రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని ప్రశ్నించండి
  • మోదీని ఇంద్రుడు, చంద్రుడు అంటూ జఫ్పాల్లాగా పొగుడుతున్నారు
  • బాలయ్య మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు
ఏపీ బీజేపీ నేతలను 'జఫ్పా'లుగా టీడీపీ నేత జలీల్ ఖాన్ పేర్కొన్నారు. చంద్రబాబును ఉద్దేశించి జఫ్పాల మాదిరి మాట్లాడవద్దని ఎద్దేవా చేశారు. ఏపీకి తీరని అన్యాయం చేసిన మోదీని వెనకేసుకొస్తున్నారని... తద్వారా ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి మోదీ అన్యాయం చేస్తున్నారా? లేదా? అనే విషయాన్ని బీజేపీ నేతలు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న మోదీని ప్రశ్నించకుండా... జఫ్పాల్లాగ మోదీని ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతున్నారని మండిపడ్డారు. మోదీ మీకు పెద్ద కావచ్చు... మాకు పెద్ద కాదని అన్నారు. మోదీ కంటే చంద్రబాబు ఎంతో అనుభవశాలి అని... మోదీకి వంద చెరువుల నీరు తాగించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు వున్నాయని చెప్పారు. మోదీ గురించి బాలయ్య మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని అన్నారు. 
jaleel khan
Chandrababu
Narendra Modi
BJP
Telugudesam

More Telugu News