Road Accident: విశాఖపట్నం జిల్లాలో విషాదం.. నవ వరుడి ప్రాణం తీసిన అతి వేగం

  • అనకాపల్లి శారదానగర్‌కు చెందిన శంకర్‌ మృతి
  • మూడు రోజుల క్రితమే వివాహం
  • గోకులపాడు సమీపంలో ప్రమాదం
అతి వేగం నవవరుడి ప్రాణాలను బలిగొంది. అనకాపల్లి శారదానగర్‌కు చెందిన శంకర్‌ అనే యువకుడికి మూడు రోజుల క్రితం ఓ యువతితో పెళ్లి జరిగింది. నవ దంపతులు ఇద్దరూ ఈ రోజు విశాఖపట్నం జిల్లాలోని ఎస్‌.రాయవరం మండలం గోకులపాడు సమీపంలో జాతీయరహదారిపై కారులో వెళుతున్నారు. అయితే, ఆ కారుని వేగంగా నడపడంతో గోకులపాడు సమీపంలో ఒక్కసారిగా అదుపు తప్పి లారీని ఢీ కొట్టడంతో నవ వరుడు అక్కడిక్కడే మృతి చెందాడు. అతడి భార్యకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానికుల సాయంతో పోలీసులు చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 
Road Accident
Vizag

More Telugu News