paruchuri: న్యాయ పోరాటం కోసం ముందడుగువేయ్, పవన్ కల్యాణ్‌!: పరుచూరి గోపాలకృష్ణ

  • నిన్న ఛాంబర్ లో పవన్‌ని కలిశా
  • గన్‌మెన్ల మీద నేను పెట్టిన ట్వీట్ చూపించా
  • ఉపన్యాసం మధ్యలో నవ్వుతాడే, అలాగే నవ్వి కరచాలనం చేశాడు
  • పవన్ వెనుక జనశక్తి ఉంది
ప్రముఖ తెలుగు న్యూస్‌ ఛానెళ్లపై, సినీ పరిశ్రమపై జరుగుతోన్న ప్రచారంపై మండిపడుతోన్న పవన్‌ కల్యాణ్‌ నిన్న ఫిలిం ఛాంబర్‌కు వెళ్లి సినిమా పెద్దలను నిలదీసిన విషయం తెలిసిందే. పవన్ అక్కడకు చేరుకున్న క్రమంలో చాలా మంది సినీ ప్రముఖులు కూడా అక్కడకు వెళ్లి పవన్‌కు మద్దతు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ను తాను కూడా కలిశానంటూ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తాజాగా ట్వీట్ చేశారు.

'నిన్న ఛాంబర్ లో పవన్ ని కలిసినప్పుడు గన్ మెన్ల మీద పెట్టిన ట్వీట్ చూపించా.. ఉపన్యాసం మధ్యలో నవ్వుతాడే అలాగే నవ్వి కరచాలనం చేశాడు. న్యాయ పోరాటం కోసం ముందడుగు వేయ్ పవన్.. నీ వెనుక జనశక్తి వుంది' అని పరుచూరి పేర్కొన్నారు.

కాగా, నిన్న పరుచూరి ఓ ట్వీట్ చేస్తూ... 'పవన్ కల్యాణ్ తన భద్రత కోసం ప్రభుత్వం ఇచ్చిన 2 ప్లస్ 2 గన్ మెన్ సౌకర్యాన్ని వదులుకున్నాడట.. ప్రతి జన సైనికుడూ తనకు ఒక గన్‌మెనే కదా.. దమ్ముతో దుమ్ము రేపేవాళ్లు వెనక్కి తిరిగి చూడరు. వెనక చూపు చూసుకోడానికి వెంట జనసైన్యం ఉంది, ఆ పక్క ఈ పక్క వామపక్షాలున్నాయి. ప్రశ్నించడమే గెలుపుగా సాగిపో' అంటూ ట్వీట్‌ చేసి పవన్‌ను ఆయన ప్రోత్సహించిన విషయం విదితమే. పవన్ కల్యాణ్‌ను సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది.
paruchuri
Pawan Kalyan
Tollywood

More Telugu News