Balakrishna: బాలకృష్ణ ఇంటిని చుట్టుముట్టిన బీజేపీ నేతలు!

  • గేటు ఎక్కిన కార్యకర్తలు
  • లోపలికి వెళ్లేందుకు యత్నం
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఉద్రిక్తత
హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని బీజేపీ నేతలు చుట్టుముట్టడంతో కలకలం చెలరేగింది. నిన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో చేసిన ధర్మపోరాట దీక్షలో మాట్లాడిన బాలయ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బాలకృష్ణ నివాసం ముందు బైఠాయించి బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 
Balakrishna
Narendra Modi
BJP
Telugudesam

More Telugu News