Puri Jagannadh: మెగా హీరోతో పూరీ తదుపరి సినిమా?

షార్ట్స్‌లో చూడండి
పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ తో 'మెహబూబా' సినిమాను తెరకెక్కించాడు. ఒక సైనికుడికి .. ముస్లిం యువతికి మధ్య కొనసాగే ప్రేమకథగా ఈ సినిమా ఉండనుంది. త్వరలోనే ఈ సినిమాను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తరువాత ఆయన మెగా హీరోతో ఒక సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

పొలిటికల్ డ్రామాగా ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. కొంతకాలంగా పూరీ ఈ కథపై చేస్తూ వచ్చిన కసరత్తు పూర్తికావొచ్చిందని అంటున్నారు. రాజకీయ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాను సాధ్యమైనంత వరకూ చరణ్ తోనే చేయాలని భావిస్తున్నాడట. కుదరని పక్షంలో వరుణ్ తేజ్ తో సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.   
Go Back to Shorts
Puri Jagannadh
charan
varun tej

More Telugu News