Congress: కాంగ్రెస్ పార్టీతోనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది: చిరంజీవి

  • అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమితుడైన గిడుగు రుద్రరాజు
  • అభినందించిన కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి
  • ప్రకటన విడుదల చేసిన ఏపీసీసీ
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని, 2019లో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమితుడైన గిడుగు రుద్రరాజు ఈరోజు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని హైదరాబాద్ లోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా ఏపీ నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, అలాగే ఒడిశా ఇంఛార్జిగా నియమితుడైన గిడుగు రుద్రరాజును చిరంజీవి అభినందించారు. ఈ మేరకు ఏపీసీసీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని, పార్టీలో కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అన్నారు.
Congress
Andhra Pradesh
Special Category Status
Chiranjeevi

More Telugu News