Tollywood: ముగిసిన సమావేశం.. మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన సినీ పెద్దలు!

  • క్యాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ సమస్యలపై చర్చించిన సినీ పెద్దలు
  • అన్నపూర్ణ  స్టూడియోస్ లో ముగిసిన సమావేశం
  • రెండున్నర గంటలకు పైగా చర్చించిన వైనం
  • ఈ సమావేశానికి హాజరైన 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు
అన్నపూర్ణ సినీ స్టూడియోస్ లో ఈ రోజు ఉదయం ప్రారంభమైన సినీ పెద్దల సమావేశం కొంచెం సేపటి క్రితం ముగిసింది. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సమావేశం సుమారు రెండున్నర గంటలకు పైగా కొనసాగింది. క్యాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ సమస్యలపై చర్చించే నిమిత్తం 24 క్రాఫ్ట్స్ కు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో చర్చించారు.

అయితే, సమావేశానంతరం, మీడియాతో మాట్లాడకుండానే సినీ పరిశ్రమ పెద్దలు వెళ్లిపోవడం గమనార్హం. కాగా, ఈ సమావేశానికి అగ్రహీరో పవన్ కల్యాణ్ హాజరవుతారని ముందు చెప్పినప్పటికీ, భద్రతా కారణాల రీత్యా ఆయన హాజరు కాలేదు. 24 క్రాఫ్ట్స్ కు చెందిన ప్రతినిధులతో పవన్ సమావేశం అవుతారని, ఈ సమావేశం ఎక్కడ నిర్వహిస్తారనేది త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం.
Tollywood
annapurnastudios

More Telugu News