Pawan Kalyan: అన్నపూర్ణ స్టూడియోస్ లో సమావేశాన్ని రద్దు చేసుకున్న పవన్!

  • భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం
  • స్టూడియో యాజమాన్యం అంగీకరించకలేదట
  • ఈ సమావేశం రద్దు కాలేదని, మరోచోట నిర్వహిస్తారని సమాచారం
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై జరుగుతున్న రాద్ధాంతంపై చర్చించేందుకు ఈ ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో సినీ పెద్దలు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ సైతం హాజరు అవుతారని, 24 క్రాఫ్ట్స్ తో సమావేశం కానున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ సమావేశాన్ని పవన్ రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా ఈ సమావేశం నిర్వహించేందుకు స్టూడియో యాజమాన్యం అంగీకరించకలేదని సమాచారం.

 అయితే, 24 క్రాఫ్ట్స్ పెద్దలతో ఈ సమావేశం పూర్తిగా రద్దు కాలేదని, ఎక్కడ నిర్వహించాలనే విషయమై ఆలోచిస్తున్నారని, ఈ విషయమై ‘జనసేన’ వర్గాలు కొంచెం సేపట్లో స్పష్టం చేసే అవకాశం ఉంది. కాగా,  ఇప్పటికే 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా, నిర్మాతలు సురేష్‌ బాబు, అల్లు అరవింద్‌, కేయస్‌ రామారావు, దానయ్య, ఘట‍్టమనేని ఆదిశేషగిరిరావు, ఠాగూర్ మధు, అశోక్‌ కుమార్‌, సీ కల్యాణ్‌ లతో పాటు 24 క్రాఫ్ట్స్ కు చెందిన పలువురు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ అక్కడికి వస్తారనే సమాచారంతో అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
Pawan Kalyan
annapurna studios

More Telugu News