Pawan Kalyan: సినిమా హీరోల అభిమాన సంఘాలు రౌడీల్లా వ్యవహరిస్తున్నాయి : సి.నరసింహారావు

  • అభిమాన సంఘాలను తక్షణమే నిషేధించాలి
  • ఏ హీరో అభిమాన సంఘానికి రిజిస్ట్రేషన్ ఉండకూడదు
  • అభిమాన సంఘాలు గొడవలకు దిగితే రౌడీషీట్ ఓపెన్ చేయాలి
సినిమా హీరోల అభిమాన సంఘాలు రౌడీల్లా వ్యవహరిస్తున్నాయని, వాటిని తక్షణం నిషేధించాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి.నరసింహారావు కోరారు. ‘ఏబీఎన్’ లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏ హీరో అభిమాన సంఘానికి రిజిస్ట్రేషన్ ఉండకూడదని, ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని వాటిని నిషేధించేలా చూడాలని అన్నారు.

అభిమాన సంఘాలు ఎక్కడైనా గొడవలకు పాల్పడితే వెంటనే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని అభిప్రాయపడ్డ ఆయన, అన్ని రాష్ట్రాల్లోనూ అభిమాన సంఘాలను నిషేధించాలని కోరారు. ఒకవేళ అభిమాన సంఘాలు ఉండాలనుకుంటే వాటికి రిజిస్ట్రేషన్, కార్యవర్గం, ఎన్నికలు ఉండాలని, ఇవేమీ లేకుండా అభిమాన సంఘాల ముసుగులో తమ ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించకూడదని అన్నారు.
Pawan Kalyan
c.narasimha rao

More Telugu News