Uttar Pradesh: కళ్యాణ మండపంలో సినీ తరహా సంఘటన.. ప్రియుడిని చితబాదిన బంధువులు

  • నగీనా జిల్లాలో దళిత కుటుంబంలో వివాహం
  • బైక్ పై కల్యాణ వేదిక దగ్గరకి వచ్చిన ఉన్నత వర్గానికి చెందిన రాహుల్
  • బైక్ పై నుంచి పూల దండను వధువు మెళ్లోకి విసిరిన రాహుల్
ఉత్తరప్రదేశ్‌ లో ఒక కళ్యాణ వేదికపై చోటుచేసుకున్న ఘటన పెళ్లికి హాజరైన అతిథుల్ని ఆశ్చర్యానికి గురి చేయగా, వరుడి తరపు బంధువులను పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయేలా చేసింది. నగీనా జిల్లాలో చోటుచేసుకున్న ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకు చెందిన దళిత యువతికి పెద్దలు పెళ్లి చేస్తున్నారు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఉన్నత వర్గానికి చెందిన రాహుల్ (24) బైక్ పై కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నాడు. బైక్ పై నుంచే చేతిలో ఉన్న పూల మాల విసిరాడు. ఆ మాల నేరుగా వెళ్లి కల్యాణ మండపంపైనున్న వధువు మెడలో పడింది.

 దీంతో పెళ్లికి వచ్చిన అతిథులంతా ఆశ్చర్యపోయారు. వారు తేరుకునేలోపు వేదికపైనున్న వధువు, బైక్ దగ్గరకి వచ్చి తన మెడలో ఉన్న పూదండ తీసి రాహుల్ మెడలో వేసింది. ఇంతలో వధువు తరపు బంధువులు రాహుల్ ను చుట్టుముట్టి చితక్కొట్టారు. ఇంత జరిగిన తరువాత వివాహం నిలవదని గుర్తించిన, అసలు వరుడి తరపు బంధువులు పెళ్లి కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. వధువు బంధువుల ఫిర్యాదుతో రంగప్రవేశం చేసిన పోలీసులు, రాహుల్ ను అరెస్టు చేశారు. రాహుల్, వధువు ఒకే కళాశాలో చదువుకున్నారని, వారిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది.
Uttar Pradesh
nagin district
marriage
rahul
lover

More Telugu News