Pawan Kalyan: 'బట్టలు విప్పి మాట్లాడుకుందాం' కార్యక్రమం నుంచి కెమెరామెన్ ట్విట్టర్ తో పవన్ కల్యాణ్!

  • ట్విట్టర్ లో వరుసగా మెసేజ్ లు పెడుతున్న పవన్ కల్యాణ్
  • తన తల్లిపై ఆరోపణలు చేసిన వారిపై చర్యలకు డిమాండ్
  • ఓ 'అజ్ఞాతవాసి' గుట్టు బయటపెడతానని వెల్లడి
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం బయటపడ్డ తరువాత, తన తల్లిని విమర్శించారని ఆరోపిస్తూ, నిన్న ఫిల్మ్ చాంబర్ కు వచ్చి, ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్, నేడు తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా మెసేజ్ లు పెడుతున్నారు.

'అజ్ఞాతవాసి' అని ఓ వ్యక్తిని అభివర్ణిస్తూ, ఆయన్ని లక్ష్యంగా చేసుకుని, అతనో బ్లాక్ మెయిలర్ అని, ఈ విషయాన్ని ఓ సీఎం తన మంత్రి వద్ద అన్నారని చెప్పిన సంగతి తెలిసిందే. ఆపై "స్టే ట్యూన్డ్ టూ 'బట్టలు విప్పి మాట్లాడుకుందాం' ప్రోగ్రామ్ నుంచి - పవన్ కల్యాణ్ విత్ కెమెరామెన్ ట్విట్టర్" అంటూ మరో ఆసక్తికర ట్వీట్ వదిలారు. పవన్ తదుపరి ఏం చెప్పబోతారన్న ఆసక్తి నెలకొంది.
Pawan Kalyan
Twitter
Agnatawasi

More Telugu News