Sri reddy: 'కాస్టింగ్ కౌచ్'పై చర్చించేందుకు అన్నపూర్ణా స్టూడియోలో అత్యవసర సమావేశం... మంత్రులు, పోలీసు అధికారులు కూడా హాజరు!

  • శ్రీరెడ్డి వ్యాఖ్యలతో మరో మలుపు తిరిగిన క్యాస్టింగ్ కౌచ్
  • 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో సమావేశం
  • శాంతి భద్రతల సమస్యతో అన్నపూర్ణా స్టూడియోస్ లో సమావేశం
తన తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కల్యాణ్ సీరియస్ అయిన వేళ, క్యాస్టింగ్ కౌచ్ పై చర్చించేందుకు అన్నపూర్ణా స్టూడియోలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని ఇండస్ట్రీ పెద్దలు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో పాటు తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు, పోలీసు ఉన్నతాధికారులు సైతం హాజరవుతుండటం గమనార్హం.

సమావేశంలో 'మా', నిర్మాతల మండలి, జూనియర్ ఆర్టిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. తొలుత జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ చాంబర్ లో సమావేశం పెట్టాలని భావించినా, అక్కడికి అభిమానులు పెద్దఎత్తున వస్తే, శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చన్న ఆలోచనతో అన్నపూర్ణా స్టూడియోస్ లో నిర్వహించాలని నిర్ణయించారు. మరికాసేపట్లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది.
Sri reddy
Pawan Kalyan
Annapurna Studios
Talasani
Hyderabad
Tollywood
Casting Couch

More Telugu News