yogi adityanath: ఫేస్‌బుక్ చెప్పేసింది.. యోగి ఆదిత్యనాథే పాప్యులర్ సీఎం అట!

షార్ట్స్‌లో చూడండి
దేశంలోని మిగతా ముఖ్యమంత్రులతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాప్యులర్ సీఎం అని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్ తేల్చింది. యోగి ఫేస్‌బుక్ పేజ్ బాగా పాప్యుల్ అయిందని పేర్కొంది. యోగి తర్వాతి స్థానంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఫేస్‌బుక్ పేజీలు నిలిచాయని పేర్కొంది.

ఆయా పేజీల పాప్యులారిటీని అంచనా వేసేందుకు జనవరి 1, 2017 నుంచి 31 డిసెంబరు మధ్య కాలంలో ఆయా పేజీలను పరిశీలించినట్టు పేర్కొంది. ఆయా పేజీల్లో షేర్లు, కామెంట్లు తదితర వాటి ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది. అలాగే ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, రాజకీయ పార్టీలకు చెందిన ఫే‌స్‌బుక్ పేజీలకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్‌బుక్ విడుదల చేసింది.
Go Back to Shorts
yogi adityanath
Uttar Pradesh
Facebook

More Telugu News