Nara Lokesh: మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది... పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై స్పందించిన నారా లోకేశ్

  • పవన్ కల్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి
  • ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం
  • వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది
‘టీవీ 9తో కలసి మీ కొడుకు, అతని స్నేహితుడు నాపై చేస్తున్న దుష్ప్రచారం మీకు తెలియదంటే నమ్మమంటారా?’ అంటూ సీఎం చంద్రబాబుని పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరో చెపితే అన్నానన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న, విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదు. వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది. మాతృదేవోభవ’ అని లోకేశ్ పేర్కొన్నారు. 
Nara Lokesh
Pawan Kalyan
Telugudesam
Jana Sena

More Telugu News