Pawan Kalyan: రేపు కీలక పరిణామం జరగబోతోంది.. ఫ్యాన్స్‌ విధ్వంసానికి పాల్పడవద్దు: పవన్ కల్యాణ్‌

  • టీవీ9 శ్రీని రాజు నాపై పరువు నష్టం దావా వేయనున్నాడు
  • ఫ్యాన్స్‌ శాంతియుతంగా ఉండాలి
  • నేను ఆ ఛానెల్‌ హెడ్‌లపై న్యాయపరమైన యుద్ధం చేస్తా 
  • టీవీ9, టీవీ5, ఏబీఎన్ ఛానళ్లను బహిష్కరించాలి
దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ ప్రోత్సాహంతో యువ నటి శ్రీరెడ్డి తనపై చేసిన వ్యక్తిగత దూషణల విషయంపై తెలుగు న్యూస్‌ ఛానెల్‌ టీవీ9 కొన్ని రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు అసభ్యకరంగా డిబేట్లు నిర్వహించిందంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డ విషయం తెలిసిందే. టీవీ9 శ్రీని రాజు ఫొటోలను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆయనపై పవన్ తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.

తాజాగా, పవన్ కల్యాణ్ మరో ట్వీట్ చేస్తూ... రేపు శ్రీని రాజు తనపై పరువునష్టం దావా వేస్తున్నారని, తన ఫ్యాన్స్‌ శాంతియుతంగా ఉండాలని, ఎటువంటి విధ్వంసకర చర్యలకు పాల్పడకూడదని కోరారు. అలాగే, తాను కూడా ఆ ఛానెల్‌ హెడ్‌లపై సుదీర్ఘంగా న్యాయపరమైన యుద్ధం చేస్తానని ప్రకటించారు.  

అనంతరం మరో ట్వీట్ చేస్తూ.. మన సోదరీమణులు, అమ్మలు, కూతుళ్లను దుర్భాషలాడుతూ కథనాలు ప్రసారం చేసే టీవీ9, టీవీ5, ఏబీఎన్ ఛానళ్లను బహిష్కరించాలని, నిస్సహాయులైన వారికి సాయం చేయాల్సిందిపోయి, వారిని అశ్లీలంగా చూపిస్తూ వ్యాపారం చేసుకోవాలని ఆ ఛానల్స్‌ చూస్తున్నాయని, వాటిని బాయ్‌కాట్ చేయాలని అన్నారు.
Pawan Kalyan
RGV
Tollywood

More Telugu News