Telangana: సినీ పరిశ్రమను కుదిపేస్తోన్న వివాదాలపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం.. రేపు కీలక భేటీ

  • సమస్యల పరిష్కారానికి చొరవ
  • పోలీసు ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులతో రేపు తలసాని భేటీ
  • కొన్ని రోజులుగా టాలీవుడ్‌ని కుదిపేస్తోన్న సమస్యలు
తెలుగు సినీ పరిశ్రమ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న సమస్యలను పరిష్కరించే దిశగా దృష్టి సారించింది. ఈ విషయంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ రేపు రాష్ట్ర పోలీసు ఉన్నతాధి కారులు, సినీ ప్రముఖులతో సమావేశం కానున్నారు. కాగా, సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ పలువురు మహిళా నటులు ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే.

అలాగే, తెలుగు వారికి అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల యువనటి శ్రీరెడ్డి ఈ విషయంపై నిరసన తెలపడంతో ఈ ఆరోపణలు మరింత పెరిగిపోయి, కీలక మలుపులు తిరిగి టాలీవుడ్‌ని కుదిపేస్తున్నాయి. జాతీయ మీడియాలోనూ టాలీవుడ్‌ తీరుపై వార్తలు వస్తున్నాయి. దీంతో టాలీవుడ్‌ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపుతూ ముందుకు వచ్చింది.   
Telangana
Tollywood
Talasani

More Telugu News