vijay devarakonda: విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' ప్రత్యేకత అదేనట!

  • విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీవాలా'
  • దర్శకుడిగా రాహుల్ సంకృత్యన్ 
  • కొత్తదనంతో కూడిన కథాకథనాలు
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో 'టాక్సీవాలా' చిత్రం రూపొందింది. గీత 2 .. యూవీ పిక్చర్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏదైనా కథ పట్టుకుని గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లోకి అడుగు పెడితే, ఆ కథలో అనేక మార్పులు .. చేర్పులు జరుగుతాయనే టాక్ వుంది.

అయితే ఈ స్క్రిప్ట్ విషయంలో మాత్రం తాము జోక్యం చేసుకోలేదని అల్లు అరవింద్ స్వయంగా చెప్పడం విశేషం. 'టాక్సీవాలా' కాన్సెప్ట్ బేస్డ్ మూవీ .. ఈ సినిమా స్క్రిప్ట్ ను దర్శకుడు వినిపించినప్పుడు ఎంతో వైవిధ్యంగా అనిపించింది. స్క్రీన్ ప్లే విషయంలోను ఆయన కొత్తగా ఆలోచించాడు. అలాంటప్పుడు తాము జోక్యం చేసుకోవడం వలన గందరగోళం అవుతుందని భావించి మేం జోక్యం చేసుకోలేదు. మా బ్యానర్లో వచ్చే సినిమాల స్క్రిప్ట్ విషయంలో మేం జోక్యం చేసుకోకపోవడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు.        
vijay devarakonda

More Telugu News