Pawan Kalyan: కలిసిపోయారు.. ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్, అల్లు అర్జున్

  • ఫిలిం ఛాంబర్ లో పవన్ కల్యాణ్, నాగబాబు
  • అక్కడకు వచ్చిన అల్లు అర్జున్
  • ఆప్యాయంగా కౌగిలించుకున్న పవన్
'చెప్పను బ్రదర్' అంటూ గతంలో ఓ ఫంక్షన్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏ సందర్భంలో కూడా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ లు కలవలేదు. ఏ ఫంక్షన్ లోనూ ఇద్దరూ కలసి కనిపించలేదు. ఈరోజు వీరిద్దరినీ మళ్లీ కలిపింది. పవన్ కల్యాణ్, నాగబాబులు ఫిలిం ఛాంబర్ కు చేరుకున్న సమయంలోనే అల్లు అర్జున్ కూడా అక్కడకు వచ్చాడు.

ఈ సందర్భంగా బన్నీని పవన్ కల్యాణ్ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. తన తల్లిని దూషించిన విషయంపై పవన్, నాగబాబులు లాయర్లతో చర్చిస్తున్నారు. ఇది మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయం కావడంతో... అల్లు ఫ్యామిలీ మొత్తం వీరితో కలసి నడవాలని నిర్ణయించింది.
Pawan Kalyan
Allu Arjun
nagababu

More Telugu News