vighnesh: విఘ్నేశ్ శివన్ ను హీరోను చేసే ఆలోచనలో నయనతార .. కొత్త కండిషన్
దర్శకుడు విఘ్నేశ్ శివన్ .. నయనతార ప్రేమించుకుంటున్నారనే విషయం కోలీవుడ్లో చాలాకాలం నుంచి షికారు చేస్తోంది. ఈ ఇద్దరూ కూడా ఎవరి సినిమాలు వాళ్లు చేసుకుంటూనే అడపాదడపా ఫారిన్ ట్రిప్ లు వేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో విఘ్నేశ్ ఓ కొత్త కథను రెడీ చేసుకుని, అందులోని హీరోయిన్ పాత్రలో నయనతార చేస్తేనే బాగుంటుందని అన్నాడట.
'హీరోగా ఎవరో ఎందుకు? ఆ పాత్ర నువ్వే చేసేయ్' అని నయనతార అందట. అంతేకాదు .. నయనతారను హీరోయిన్ గా తీసుకోవడానికి ఎవరు సంప్రదించినా, విఘ్నేశ్ ను హీరోగా తీసుకుంటేనే అని నయనతార కొత్తగా షరతు పెడుతోందట. నయనతారకి గల క్రేజ్ తెలిసిందే కనుక, విఘ్నేశ్ హీరో అయ్యే సమయం వచ్చేసినట్టేనని చెప్పుకోవాలి.