Pawan Kalyan: సార్.. మీడియాను కంట్రోల్ చేసే శక్తి ఉన్న మీకు... వీటిలో ఏది ముఖ్యం?: చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ప్రశ్న

  • మీడియాకు వ్యభిచారం యొక్క చట్టబద్ధతే ముఖ్యం
  • మీ షోలకు మించిన షోను నేను ఇస్తా
  • ఇప్పుడు దొరలంటే.. మీడియా ఆసాములు
మీడియాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. టీఆర్పీలను పెంచే షోల కోసం ఛానళ్లు చచ్చిపోతున్నాయని ఆయన ట్వీట్ చేశారు. దానికి మించిన షోను తాను ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన మరో ట్వీట్ చేశారు.

'ముఖ్యమంత్రి చంద్రబాబు గారు... ఈ ఛానళ్లు అన్నింటికీ ప్రత్యేక హోదా కంటే వ్యభిచారం యొక్క చట్టబద్ధతే ముఖ్యం. మీడియాను కంట్రోల్ చేసే శక్తి గల మీరు... ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యతను ఇస్తారు? ఒక్క విషయాన్ని చెప్పడం మర్చిపోయా. టీవీ5 సీనియర్ యాంకర్ సాంబశివరావును నారా లోకేష్ ఎంతో ప్రేమతో అంకుల్ అని పిలుస్తుంటారు' అని ట్వీట్ చేశారు. ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములని... కానీ, ఇప్పుడు దొరలంటే మీడియా ఆసాములని... వారు చెప్పిందే వేదం, పాడిందే నాదమని ఎద్దేవా చేశారు. 
Pawan Kalyan
Chandrababu
media

More Telugu News