Pawan Kalyan: నా తల్లిపై ఆ వార్తను పదే పదే ప్రసారం చేశారు.. మరొకరి తల్లిపై అయితే ప్రసారం చేసేవారా?: పవన్ కల్యాణ్

  • బాబు, లోకేష్, ప్రతిపక్ష నేతల తల్లిపై ఆ భాష వాడితే పదేపదే ప్రసారం చేసేవారా?
  • పోనీ కనీసం బాలకృష్ణ తల్లిపై ఆ పదప్రయోగం వాడినా అలాగే ప్రసారం చేసేవారా?
  • మరి పవన్ కల్యాణ్ తల్లికే ఎందుకు?
వరుస ట్వీట్లతో హోరెత్తించిన ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ మీడియాను కూడా వదల్లేదు. మీడియాను ధనిక, శక్తిమంతమైనదిగా పేర్కొంటూ, ‘నా తల్లిపై ప్రయోగించిన అభ్యంతరకర భాషని పదేపదే ప్రసారం చేసిన వార్తను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ లేదా ప్రతిపక్షనేతల తల్లిపై కూడా వాడి ఉంటే మీ మీడియా సంస్థలు ప్రసారం చేసే ధైర్యం చేసేవా?’ అని సూటిగా ప్రశ్నించారు.

‘పోనీ, కనీసం బాలకృష్ణ తల్లిపై అలాంటి పదప్రయోగం చేసినా, మీ మీడియా ఛానెల్స్ ప్రసారం చేసే ధైర్యం చేసేవా?’ అని నిలదీశారు. కేవలం పవన్ కల్యాణ్ తల్లి, ఎవరికీ, ఏనాడూ అపకారం తలపెట్టని పవన్ కల్యాణ్ తల్లిపై వాడిన అసభ్యకరమైన భాషను మాత్రం పదేపదే టెలీకాస్ట్ చేసి, దానిపై విశ్లేషణలు, చర్చలు చేపడతారు... అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు చెప్పండి శక్తిమంతమైన, ధనిక మీడియా శక్తులారా? పవన్ కల్యాణ్ కే ఈ ప్రత్యేకమైన ట్రీట్ మెంట్ ఎందుకు?’ అని ఆయన నిలదీశారు.
Pawan Kalyan
Twitter

More Telugu News