kodela: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన స్పీకర్‌ కోడెల

  • సైకిల్ యాత్ర చేస్తుండగా గాయం
  • గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఆసుపత్రిలో చికిత్స
  • మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ రోజు సైకిల్ యాత్ర చేస్తుండగా ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి ఆయన సైకిల్‌ను ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో స్వల్ప గాయాలయిన ఆయనను గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించారు.

కాగా, చికిత్స అనంతరం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ఆయనకు స్కానింగ్ తీసి, రిపోర్ట్స్‌ పరిశీలించి ముంబయిలోని బర్డ్స్‌ ఆసుపత్రి వైద్యులతో చర్చించిన స్థానిక వైద్యులు.. మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని కోడెల శివప్రసాద్‌కు సూచించారు. దీంతో కోడెల గుంటూరులోని స్వగృహానికి వెళ్లారు.
kodela
Andhra Pradesh
Guntur District

More Telugu News