Chandrababu: చంద్రబాబు దీక్షకు సర్వం సిద్ధం.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మంత్రుల దీక్షలు

  • కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సర్కారు పోరాటం
  • రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు దీక్ష
  • 13 జిల్లాల్లో దీక్షల్లో పాల్గొననున్న మంత్రులు
ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'ధర్మ పోరాట దీక్ష'కు దిగుతోన్న విషయం తెలిసిందే. ఆయన దీక్షకు మద్దతుగా 13 జిల్లాల్లో ఏపీ మంత్రులు దీక్షకు దిగుతున్నారు.

 విశాఖపట్నంలో ఆయ్యన్న పాత్రుడు, శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు, విజయ నగరం జిల్లాలో సుజయకృష్ణ, తూర్పు గోదావరి జిల్లాలో చినరాజప్ప, పశ్చిమ గోదావరి జిల్లాలో జవహర్, గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు, ప్రకాశం జిల్లాలో శిద్ధా రాఘవరావు, నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి, అఖిలప్రియ, కడప జిల్లాలో ఆదినారాయణరెడ్డి, అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, చిత్తూరు జిల్లాలో అమర్‌నాథ్‌రెడ్డి దీక్షకు దిగనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో చంద్రబాబుతో పాటు మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్ర పాల్గొననున్నారు. 
Chandrababu
Andhra Pradesh
Special Category Status

More Telugu News