pinarayi vijayaan: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన కేరళ ముఖ్యమంత్రి

  • హైదరాబాదుకు విచ్చేసిన కేరళ సీఎం
  • పంజాగుట్ట పీఎస్‌లో స్వాగతం పలికిన హోంమంత్రి, డీజీపీ
  • స్టేషన్‌లో ఉన్న వసతుల గురించి తెలుసుకున్న కేరళ సీఎం
హైదరాబాదులోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దేశంలోనే రెండో అత్యుత్తమ పీఎస్‌గా అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ రోజు ఆ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. ఆయనకు తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి స్వాగతం పలికారు. పినరయి విజయన్‌ ఈ సందర్భంగా స్టేషన్ అధికారులు, సిబ్బందితో కాసేపు మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, కేసుల పరిష్కారాలు, స్టేషన్ లో ఉన్న మౌలిక వసతులను పంజాగుట్ట పోలీసులు ఆయనకు వివరించి చెప్పారు. విజయన్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.    
pinarayi vijayaan
punajagutta ps
mahender reddy

More Telugu News