Nara Lokesh: తనపై ఆరోపణలు చేయడం సరికాదన్న మోదీ.. దీటుగా సమాధానమిచ్చిన నారా లోకేశ్‌

  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు
  • చట్టంలో పొందుపర్చిన 18 హామీలు నెరవేర్చలేదు
  • బీజేపీ నేతలే మాపై బురద చల్లుతున్నారు
దేశంలో కావలసిన దానికంటే ఎక్కువగానే నగదు ఉందంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ట్వీట్‌పై నిన్న ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిపడుతూ దీటుగా కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు ప్రధానమంత్రి మోదీపై కూడా లోకేశ్ విమర్శలు చేశారు. సరైన పరిశోధన, ఆధారాలు లేకుండా తనపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమంటూ నరేంద్ర మోదీ తాజాగా ఓ ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన నారా లోకేశ్ ట్వీట్ చేస్తూ... ఏపీకి ప్రత్యేక హోదా సహా చట్టంలో పొందుపర్చిన విధంగా ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని తాము ప్రశ్నించామని, బీజేపీ నేతలే ఎటువంటి ఆధారాలు లేకుండా తమపై బురద చల్లుతున్నారని అన్నారు. ఇటువంటి ఆరోపణలు చేయడం భావ్యమేనా? అని ఆయన ప్రశ్నించారు. 
Nara Lokesh
Chandrababu
Narendra Modi

More Telugu News