చంద్రబాబు దీక్షకు సినీ పరిశ్రమ మద్దతు: తమ్మారెడ్డి భరద్వాజ
- ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
- హోదా విషయంలో కేంద్రం ఎందుకు వెనకడుగు వేసిందో!
- ఐదేళ్లలో ఏపీకి సినీ పరిశ్రమ వస్తుందని భావిస్తున్నా
కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు చేపడుతున్న నిరాహారదీక్షకు సినీ పరిశ్రమ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని అన్నారు. మరో ఐదేళ్లలో ఏపీకి తెలుగు సినీ పరిశ్రమ వస్తుందని తాను భావిస్తున్నట్టు తమ్మారెడ్డి తెలిపారు. అమరావతికి ఇండస్ట్రీని తరలించాలని ఇంతవరకు ఎవరూ పిలవలేదని చెప్పారు. సినీ పరిశ్రమకు ఎలాంటి రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదని... కేవలం సహకరిస్తే చాలని అన్నారు.