YSRCP: బాబు దీక్ష రోజున సంచలన ప్రకటన చేయనున్న జగన్?

  • ఈదరలో పార్టీ ఎంపీలతో సమావేశమైన జగన్
  • ఎమ్మెల్యేలతో రాజీనామా నిర్ణయం
  • బాబు దీక్ష రోజున ప్రకటన
తన పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం దీక్షతో ఒత్తిడి పెరుగుతుందని భావించిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే ఎంపీలు రాజీనామా చేయడంతో మైలేజీ వచ్చిందని భావించిన జగన్, సీఎం దీక్ష రోజు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే రాజకీయంగా మరింత కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా నినాదాన్నే ప్రచారాస్త్రంగా మలచుకోవాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది.
YSRCP
Jagan
politics
mla's resignition

More Telugu News