manu bakar: స్వర్ణం సాధించినంత మాత్రాన నేనేమైనా గొప్పదాన్నా?: మనుబాకర్

  • అవమానం జరగలేదు
  • నా కంటే పెద్దవారు వేదికపైకి వచ్చారు
  • వారిని గౌరవించాను
కామన్‌ వెల్త్‌ గేమ్స్ లో స్వర్ణం సాధించినంత మాత్రాన నేనేమైనా గొప్పదాన్నైపోతానా? అని ప్రముఖ షూటర్ మనుబాకర్ మీడియాను ప్రశ్నించింది. కామన్ వెల్త్ గేమ్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించినందుకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆమెను కింద కూర్చోబెట్టి, అవమానించారన్న విషయంపై గుర్గావ్ లో ఆమె ఘాటుగా స్పందించింది.

ఆ వేడుకలో తనకు ఎలాంటి అవమానమూ జరగలేదని స్పష్టం చేసింది. తనకంటే పెద్దవారు అక్కడికి రావడంతో వారికి మర్యాద ఇచ్చానని తెలిపింది. స్వర్ణం సాధించినంత మాత్రాన తాను వారికంటే గొప్పదాన్ని అవుతానా? అని ఆమె ఎదురు ప్రశ్నించింది. మీడియాపై తనకు ఎంతో అభిమానం, నమ్మకం, గౌరవం ఉన్నాయని చెప్పిన ఆమె, నకిలీ వార్తల్ని సృష్టించి ప్రజలకు మీడియా ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది? అంటూ నిలదీసింది. టీఆర్‌పీ కోసం తనను వివాదంలోకి లాగొద్దని ఆమె స్పష్టం చేసింది. దీనిని తన తల్లిదండ్రులు ఖండించినా మీడియా పట్టించుకోకపోవడంపై ఆమె మండిపడింది.
manu bakar
Commonwealth Games
gurgao

More Telugu News