srireddy: శ్రీరెడ్డికి రామ్ గోపాల్‌ వర్మ ఓ మెసేజ్‌ చేసి, పవన్‌ కల్యాణ్‌ను ఆ పదంతో తిట్టమని చెప్పాడు: సంధ్య

షార్ట్స్‌లో చూడండి
సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ శత్రువు ఒకరు తనతో అలా తిట్టించారని యువనటి శ్రీరెడ్డి ట్వీట్ చేసింది. ఆ శత్రువు ఎవరన్న విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఆ రోజు మీడియా ముందు ఉన్న శ్రీరెడ్డికి రామ్‌ గోపాల్‌ వర్మ ఓ మెసేజ్‌ చేశారని, ఆ మెసేజ్‌ను తాను చూశానని ఈ రోజు టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామాజిక కార్యకర్త సంధ్య తెలిపారు.  

అయినా, శ్రీరెడ్డి ఆ పదం ఉపయోగించడం తప్పేనని, ఆమెతో అలా తిట్టించిన రామ్ గోపాల్‌ వర్మపై ఇప్పుడు టాలీవుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలని ఆమె అన్నారు. రామ్‌ గోపాల్ వర్మ ఇటీవల తీసిన ‘జీఎస్టీ’ షార్ట్‌ ఫిలిమ్‌ గురించి తాము పోరాడామని, తమ పోరాటాన్ని బలహీనపరుస్తూ ఏదో చేయాలనే వర్మ ఇలా చేయాలనుకుంటున్నారేమోనని సంధ్య అనుమానం వ్యక్తం చేశారు.

ఆ జీఎస్టీ చిత్రీకరణ యూరప్‌లో జరిగిందని వర్మ అన్నారని, కానీ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ చివరి అంతస్తులో ఈ సినిమా షూటింగ్ కొంత భాగం జరిగిందని, అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆఫీసులోనూ ఆ షూటింగ్ జరిగిందని తమకు తెలిసిందని సంధ్య అన్నారు.
Go Back to Shorts
srireddy
Pawan Kalyan
sandya

More Telugu News