bellamkonda srinivas: ఆసక్తిని రేపుతోన్న 'సాక్ష్యం' టీజర్

  • శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం'
  • బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా పూజా హెగ్డే 
  • యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలో సాగే కథ
శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు.

 "ఈ భూమ్మీద తప్పు చేసిన ప్రతి ఒక్కరూ నాలుగు దిక్కులూ వెతికి .. ఎవరూ చూడలేదనుకుంటారు. కానీ పైనుంచి ఐదవ దిక్కొకటి మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది .. అదే కర్మ సాక్ష్యం. దాని నుంచి తప్పించుకోవడం ఎవరితరం కాదు" అనే వాయిస్ ఓవర్ పై టీజర్ మొదలవుతోంది.

ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ, యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. ఒక వైపున ఫారిన్ నేపథ్యంలోను .. మరో వైపున గ్రామీణ నేపథ్యంలోను ఈ కథ కొనసాగుతుందని టీజర్ ను బట్టి తెలుస్తోంది. 'కాల్చడానికి .. పూడ్చడానికి అది శవం కాదు .. సాక్ష్యం " అనే డైలాగ్ బాగా పేలింది.
bellamkonda srinivas
pooja hegde

More Telugu News