Jammu And Kashmir: 'కథువా' ఘటనపై భారతీయులందరూ సిగ్గుపడాలి!: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- చిన్నారులపై ఇలాంటి ఘటనలు జరగడం దారుణం
- మన సమాజం ఎటుపోతోందో ఆలోచించుకోవాలి
- ఇకపై ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా చూడాలి
కథువా ఘటనపై భారతీయులందరూ సిగ్గుపడాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. కత్రాలో జరిగిన శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ, మనకు స్వాతంత్ర్యం వచ్చిన డెబ్భై ఏళ్ల తర్వాత కూడా చిన్నారులపై ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని, మన సమాజం ఎటుపోతోందో ఆలోచించుకోవాలని, ఇకపై ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా చూడాలని అన్నారు.
ఆడపిల్లలకు ఒంటరిగా తిరిగే స్వేచ్ఛనిచ్చి, ఇప్పుడు వాళ్లపై పైశాచికత్వం చూపడం అత్యంత దారుణమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, చిన్నారులు సాక్షాత్తూ వైష్ణోదేవి ప్రతిరూపాలని, ఇలాంటి పసిమొగ్గలపై దారుణానికి పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.