Rahul Gandhi: అమేథీ ప్రపంచ ప్రసిద్ధ విద్యాకేంద్రంగా అవతరిస్తుంది!: రాహుల్ గాంధీ

  • అమేథీని సింగపూర్, కాలిఫోర్నియా మాదిరి తీర్చిదిద్దుతా
  • ఇది జరగకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు
  • అభివృద్ధిని అడ్డుకుంటోంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధీ నియోజకవర్గాన్ని సింగపూర్, కాలిఫోర్నియా మాదిరి తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పది పదిహేనేళ్ల తర్వాత సింగపూర్, కాలిఫోర్నియాలతో పాటు అమేథీ గురించి కూడా మాట్లాడుకుంటారని చెప్పిన ఆయన, అభివృద్ధిని అడ్డుకుంటోంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనని మండిపడ్డారు.

అమేథీ త్వరలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యాకేంద్రంగా అవతరించనుందని, ఇది జరగకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. కాగా, అమేథి, రాయ్ బరేలిలో రాహుల్ మూడు రోజుల పర్యటన నిమిత్తం నిన్న తన నియోజకవర్గంలో పర్యటించారు. ఓ పాఠశాలను ప్రారంభించిన అనంతరం ఓ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi
amethi

More Telugu News