akhil: అఖిల్ మూవీ కోసం రంగంలోకి దిగిన తమన్

షార్ట్స్‌లో చూడండి
అఖిల్ మూడవ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి బాణీలను అందించే పనులను తమన్ మొదలుపెట్టేశాడనేది తాజా సమాచారం.

ఈమధ్య కాలంలో యూత్ ను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమాగా 'తొలిప్రేమ' నిలిచింది. ఆడియో పరంగా కూడా ఈ సినిమా ఎక్కువ మార్కులు సంపాదించుకుంది. దాంతో వెంకీ అట్లూరి అఖిల్ ప్రాజెక్టును కూడా ఆయన చేతిలో పెట్టేశాడు. దాంతో మరోసారి యూత్ ను ఒక ఊపు ఊపేయాలనే ఉద్దేశంతో తమన్ రంగంలోకి దిగాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాతో అఖిల్ కి హిట్ పడటం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.      
Go Back to Shorts
akhil

More Telugu News