priya prakash vherier: ఈ సారి యాడ్ కోసం కన్నుగీటిన ప్రియ ప్రకాశ్!

  • ‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమా పాటలో కన్ను కొట్టిన ప్రియ ప్రకాశ్ 
  • చాక్లెట్ యాడ్ కోసం తాజాగా కన్ను గీటిన ముద్దుగుమ్మ 
  • ఆకట్టుకుంటున్న చాక్లెట్ ప్రకటన  
‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమా పాటలో కన్ను కొట్టి యావత్‌ యువతను మంత్రముగ్ధులను చేసిన మలయాళ నటి ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ మరోసారి కన్నుగీటి ఆకట్టుకుంది. అప్పుడు సినిమా కోసం కన్ను కొట్టిన ప్రియ ప్రకాశ్, ఈ సారి చాక్లెట్ యాడ్ కోసం కన్నుగీటింది. ఈ యాడ్ లో ప్రియ క్రికెట్‌ గ్రౌండ్‌లో కూర్చొని చాక్లెట్‌ తింటూ ఉండగా, ఆమె దగ్గరకి ప్రాక్టీస్ చేస్తున్న ఆటగాళ్లు విసిరిన బంతి వస్తుంది.

దానిని తనకు ఇవ్వమని ఆటగాడు అడుగుతాడు. ‘విసిరేసిన వస్తువును తాను ముట్టుకోను’ అని ప్రియ సమాధానం చెబుతుంది. దీంతో ‘నీకు చాలా ఎగస్ట్రాలున్నాయ్’ అని ఆ ఆటగాడు మండిపడితే.. ‘అది ఫ్రీ కదా’ అంటూ కన్నుగీటుతుంది. ఈ యాడ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
priya prakash vherier
munch chocolate add

More Telugu News