stock market: వరుసగా తొమ్మిదో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా తొమ్మిదో రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 90 పాయింట్ల లాభంతో 34,395 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 10,549 వద్ద ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, హిందూస్థాన్ యుని లివర్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంస్థల షేర్లు లాభపడగా, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఇన్ ఫ్రాటెల్, విప్రో, సన్ ఫార్మా సంస్థల షేర్లు నష్టాలు చవిచూశాయి.

కాగా, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగానే ప్రారంభమైనప్పటికీ, ఈ వారం వెలువడబోయే కార్పొరేట్ ఫలితాలపై దృష్టిపెట్టిన మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ ఒడిదుడుకులను ఎదుర్కొని.. మార్కెట్ ముగిసే సమయానికి లాభాలను నిలబెట్టుకున్నాయి.
Go Back to Shorts
stock market
sensex
nifty

More Telugu News