KTR: అరుణ్‌జైట్లీ ట్వీట్‌పై కౌంటర్‌ ఇచ్చిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. దేశంలో సరిపడినంత నగదు చలామణిలో ఉందని, బ్యాంకుల వద్ద అందుబాటులో ఉందని పేర్కొంటూ ఈ రోజు జైట్లీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేటీఆర్‌ స్పందిస్తూ... బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత ఆకస్మికంగానో లేక తాత్కాలికంగానో రాలేదని, ఈ విషయమై మూడు నెలలుగా హైదరాబాద్‌లో తరుచూ ఫిర్యాదులు వచ్చాయని ట్వీట్ చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని క్రమంగా వమ్ము చేస్తోన్న సమస్యపై ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ లోతుగా పరిశీలించాలని ఆయన అన్నారు.
Go Back to Shorts
KTR
Twitter
Telangana

More Telugu News