Salman Khan: విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వండి... కోర్టులో సల్మాన్ ఖాన్ పిటిషన్

  • నాలుగు దేశాల్లో పర్యటించాల్సిన అవసరం ఉందని వెల్లడి
  • విదేశీ పర్యటనకు అనుమతి పొందాలని బెయిల్ సమయంలో కోర్టు షరతు
  • దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నటుడు
కృష్ణ జింకల వేట కేసులో దోషి అయిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ జోధ్ పూర్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. నాలుగు దేశాల్లో షూటింగ్ ల రీత్యా పర్యటించేందుకు అనుమతి మంజూరు చేయాలని కోరారు. 1998లో రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ ను దోషిగా ప్రకటించి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

అనంతరం ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ అభ్యర్థనను కోర్టు మన్నించి పూచీకత్తుపై విడుదలకు ఈ నెల 7న ఆదేశించింది. దీంతో జోధ్ పూర్ కోర్టు నుంచి సల్మాన్ బెయిల్ పై విడుదలయ్యారు. అయితే, విదేశాలకు వెళ్లాలనుకుంటే అందుకు కోర్టు అనుమతి పొందాల్సి ఉంటుందని బెయిల్ మంజూరు సమయంలో కోర్టు స్పష్టం చేసింది. దీంతో విదేశీ పర్యటన అనుమతి కోసం సల్మాన్ ఖాన్ కోర్టును ఆశ్రయించారు.
Salman Khan
petition

More Telugu News