prabhas: 'సాహో' కథ బలమైనది .. అందుకు తోడుగా కళ్లు చెదిరిపోయే గ్రాఫిక్స్

షార్ట్స్‌లో చూడండి
ప్రభాస్ తాజా చిత్రంగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'అబుదాబి'లో జరుగుతోంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ అధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ప్రభాస్ ఒక న్యూస్ మేగజైన్ తో మాట్లాడుతూ .. " ఈ సినిమాలో కథాకథనాలు చాలా బలంగా కనిపిస్తాయి. వాటికి తోడుగా కళ్లు చెదిరిపోయే గ్రాఫిక్స్ కూడా ఉంటాయి"

  "ఈ సినిమా ఒక నవల తరహాలో కొనసాగే యాక్షన్ డ్రామా .. ఎక్కడా రాజీ పడకుండగా చేస్తోన్న చిత్రీకరణ, ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ను అందించడం ఖాయం" అని చెప్పాడు. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, నీల్ నితిన్ ముఖేష్ .. జాక్ ష్రాఫ్ .. చుంకీ పాండే .. అరుణ్ విజయ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమాను టీ సిరీస్ వారు భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.
Go Back to Shorts
prabhas
sharddha kapoor

More Telugu News