snakes in mla's office: ఎమ్మెల్యే కార్యాలయంలో కట్లపాము.. పట్టుకోబోయిన కూలీకి కాటు

  • పెనమలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో విషసర్పాల కలకలం
  • మొన్న తాచు పాము, నిన్న జెర్రిపోతు, తాజాగా కట్లపాము
  • కూలీ ముంజేతిపై కాటు
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ కార్యాలయంలో విషసర్పాలు కలకలం రేపుతున్నాయి. మొన్న తాచు పాము కనిపించి ఆందోళన రేపగా, నిన్న జెర్రిపోతు కనిపించి గందరగోళానికి గురి చేసింది. తాజాగా ఎమ్మెల్యే కార్యాలయం వద్ద వివిధ రకాల పనుల నిమిత్తం పలుగ్రామాలకు చెందిన ప్రజలు వేచి చూస్తున్నారు. అంతలో అక్కడ అకస్మాత్తుగా కట్లపాము కనిపించింది.

దీంతో ఆందోళన చెందిన ప్రజలు కేకలు వేయగా అక్కడే ఉన్న కూలీ అంకాలు దానిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అది అతని ముంజేతిపై కాటు వేసింది. వారు దానిని చంపే ప్రయత్నం చేయగా తప్పించుకుంది. దీంతో దానిని వెతికి చంపేశారు. అనంతరం అతనిని ఆసుపత్రికి తరలించారు. తరచు విషసర్పాలు ప్రత్యక్షమవుతుండడం పట్ల ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
snakes in mla's office
snake

More Telugu News