allu arjun: కొరటాలతో బన్నీ నెక్స్ట్ మూవీ?

  • తదుపరి ప్రాజెక్టు విషయంలో బన్నీ ఆలోచన 
  • దర్శకుడు వి.ఐ. ఆనంద్ కి 'నో' 
  • రవికాంత్ పేరెపుకు రాని గ్రీన్ సిగ్నల్    
కొరటాల శివ దర్శకత్వం వహించిన 'భరత్ అనే నేను' ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఏ హీరోతోనూ ఇంతవరకూ కొరటాల కమిట్ కాలేదు. 'భరత్ అనే నేను' రిలీజ్ అయిన తరువాత ఆ విషయంపై దృష్టి పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే తన తదుపరి సినిమాను కొరటాలతో చేయడానికి బన్నీ ఆసక్తిని చూపుతున్నాడని తెలుస్తోంది.

 సుకుమార్ తో బన్నీ చేయవచ్చనే టాక్ వచ్చింది. కానీ అంతకంటే ముందుగా మహేశ్ తో చేయాలని సుకుమార్ నిర్ణయించుకున్నాడు. ఇక వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో బన్నీ చేస్తాడని చెప్పుకున్నారు. ఆయన 'ఒక్క క్షణం' ఆశించిన స్థాయిలో ఆదరణ పొందకపోవడం వలన బన్నీ వెనకడుగేశాడు. 'క్షణం' దర్శకుడు రవికాంత్ పేరెపు ప్రయత్నించినా బన్నీ ఇంకా ఓకే చెప్పలేదు. ఈ నేపథ్యంలో బన్నీ నెక్స్ట్ మూవీ కొరటాలతోనే వుండే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే అభిప్రాయాలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.     
allu arjun
koratala

More Telugu News