Pawan Kalyan: పవన్ కల్యాణ్ తల్లికి క్షమాపణలు చెబుతూ శ్రీరెడ్డి ట్వీట్... రెచ్చిపోతున్న ఫ్యాన్స్!

  • పవన్ కల్యాణ్ తల్లిని ప్రస్తావించిన శ్రీరెడ్డి
  • రాయలేని భాష వాడుతూ ఫ్యాన్స్ కామెంట్లు 
  • ఇదేనా ప్రజానాయకుడి వైఖరి?
  • ప్రశ్నించిన నటి శ్రీరెడ్డి
పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ, ఆయన తల్లిని ప్రస్తావించిన నటి శ్రీశక్తి అలియాస్ శ్రీరెడ్డిపై మెగా ఫ్యాన్స్ ఇప్పుడు విరుచుకుపడుతున్నారు. తన పిల్లల్ని కూడా బెదిరించారని ఫేస్ బుక్ ఖాతాలో వాపోయిన శ్రీరెడ్డి, పవన్ తల్లిని క్షమాపణ కోరుతున్నానని, తన పిల్లలను ఈ వివాదంలోకి లాగుతున్నందున భావోద్వేగంతో తానా వ్యాఖ్యలు చేశానని, తనను గురించి ఎంత చెడుగా మాట్లాడినా తాను కేర్ చేయబోనని, పవన్ కల్యాణ్ అంటే అసలు లెక్క లేదని వ్యాఖ్యానించింది. శ్రీరెడ్డి ట్వీట్ కు ఘాటు సమాధానాలు ఇస్తున్న పలువురు ఫ్యాన్స్, రాయడానికి వీల్లేని భాషను సైతం వాడుతున్నారు.

ఆపై గత అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ వీడియోను పోస్టు చేస్తూ, ఓ ప్రజానాయకుడైన పవన్ కల్యాణ్, తమ బాధపై సరిగ్గా రెస్పాండ్ కాలేదని ఆరోపించారు. ఇక పవన్ గురించి మీడియా ముందు ప్రస్తావించిన అమ్మాయిలను తీవ్రంగా భయపెడుతున్నారని, ఎన్నాళ్లు అమ్మాయిల నోరు నొక్కేస్తారని ప్రశ్నించారు. తమ మీటింగ్ ను అత్యంత ఘోరంగా అభివర్ణించారని ఆరోపించారు.

కేవలం పవన్ కల్యాణ్ కు మాత్రమే తల్లి ఉన్నారా? అని ఆమె ప్రశ్నించారు. కొంతమంది ఎవరి పక్కలో పడుకోకుండానే క్యారెక్టర్లు తెచ్చుకున్నారని, వారిని కూడా ఈ రొచ్చులోకి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ లాగుతున్నారని ఆరోపించారు. తమ బాధను అర్థం చేసుకోవాలని, ఒక అమ్మాయి నిజం చెబుతుంటే నోరు నొక్కే ప్రయత్నం చేయవద్దని కోరింది. తన పోరాటాన్ని ఆపబోనని, ఈ పోరాటంలో తాము సమిధలమైనా లెక్కచేయబోమని హెచ్చరించింది.

Pawan Kalyan
Sri Reddy
Tollywood
Casting Couch

More Telugu News