Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మళ్లీ యూరప్ వెళుతున్న 'క్వీన్'
  • బన్నీ సినిమా ఆడియో వేడుకకు ఏర్పాట్లు 
  • మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట!

*  తమన్నా ప్రధాన పాత్రలో రమేశ్ అరవింద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'క్వీన్' తెలుగు రీమేక్ చివరి షెడ్యూల్ షూటింగును త్వరలో యూరప్ లో నిర్వహిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి షెడ్యూలును ఆమధ్య ఫ్రాన్స్ లో నిర్వహించగా, మరో షెడ్యూలును ఇటీవల మైసూర్ పరిసరాల్లో చేశారు. ఇక ఈ చిత్రం తమిళ వెర్షన్ లో కాజల్ నటిస్తున్న సంగతి విదితమే.
*  అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'నా పేరు సూర్య' చిత్రం ఆడియో వేడుకను తాడేపల్లిగూడెం సమీపంలోని మిలటరీ మాధవరం గ్రామంలో ఈ నెల 22న నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అనూ ఇమ్మానుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.
*  ఇటీవల 'రంగస్థలం' చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు సుకుమార్ త్వరలో మహేశ్ బాబుతో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఇందుకు సంబంధించి సుకుమార్ చెప్పిన కథకు మహేశ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.    

More Telugu News