Kambhampati Hari Babu: బీజేపీ నేత కంభంపాటి హరిబాబు సంచలన నిర్ణయం.. అధ్యక్ష పదవికి గుడ్‌బై!

  • పార్టీ అధ్యక్ష పదవికి సోమవారం రాత్రి రాజీనామా
  • రాజీనామా లేఖను అమిత్ షాకు పంపిన హరిబాబు
  • హాట్‌ టాపిక్‌గా మారిన ఆకస్మిక నిర్ణయం
ఏపీ బీజేపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపినట్టు తెలిసింది. ఇంత అకస్మాత్తుగా ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. అధ్యక్ష పదవిని ఆయన తనకు తానుగా వదులుకున్నారా? లేక అధిష్ఠానం సూచన మేరకే రాజీనామా చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత టీడీపీ-బీజేపీ మధ్య చెడింది. దీంతో బీజేపీలోని ఓ వర్గం నేతలు టీడీపీపై రోజూ విరుచుకుపడుతున్నారు. అయితే, హరిబాబు మాత్రం ఈ విషయంలో పూర్తిగా సంయమనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించి మరొకరిని నియమిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు హరిబాబు రాజీనామాతో ఆ ప్రచారానికి మరింత బలం వచ్చింది.
Kambhampati Hari Babu
BJP
Andhra Pradesh

More Telugu News