Viral Videos: రోడ్డుపక్కన కుర్రాళ్లతో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్

  • ముంబయిలో రోడ్డుపక్కనే సచిన్‌ సందడి
  • బ్యాటింగ్ చేసిన టెండూల్కర్‌
  • ప్లాస్టిక్ డివైడర్‌ను స్టంప్‌లుగా పెట్టుకున్న వైనం
టీమిండియా మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తాజాగా రోడ్డు పక్కన క్రికెట్‌ ఆడిన వీడియో వైరల్ అవుతోంది. ఆయనకు క్రికెట్‌ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సచిన్ కు కుర్రాళ్లతో కలసి గల్లీ క్రికెట్ ఆడాలనిపించిందేమో.. ముంబయిలోని ఓ గల్లీలో కొంతమంది యువకులతో కలిసి ఇలా క్రికెట్ ఆడి అలరించాడు.

సచిన్ బ్యాటింగ్ చేస్తుండగా కొందరు యువకులు ఫీల్డింగ్ చేశారు. ప్లాస్టిక్ డివైడర్‌ను స్టంప్‌లుగా పెట్టుకుని వారు క్రికెట్ ఆడుకున్నారు.  మరోవైపు అదే రోడ్డుపై నుంచి వాహనాలు వెళుతున్నాయి. క్రికెట్‌కు 2013లో సచిన్‌ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. క్రికెట్‌ చరిత్రలో ఎన్నో రికార్డులు ఆయన మీద ఉన్నాయి. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
Viral Videos
Sachin Tendulkar
Cricket

More Telugu News