టాలీవుడ్ లో తెలుగు వారికే తొంభై శాతం అవకాశాలివ్వాలి: ప్రొఫెసర్ కోదండరామ్

టాలీవుడ్ లో స్థానిక నటీనటులకు అవకాశాలు ఇవ్వాలని మహిళా నటులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమ అందరికీ ఆదర్శంగా నిలవాలని, టాలీవుడ్ లో తెలుగు వారికే తొంభై శాతం అవకాశాలు ఇవ్వాలని అన్నారు.

 టాలీవుడ్ పై మొన్నటి వరకు డ్రగ్స్ ముద్ర పడిందని, ఇప్పుడేమో లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు తలెత్తాయని అన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మహిళా నటులపై వేధింపులకు పాల్పడ్డ వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.


More Telugu News