Kodandaram: కోదండరామ్ సభకు అనుమతివ్వండి : హైకోర్టు ఆదేశాలు

  • 29న సరూర్ నగర్ స్టేడియంలో సభకు అనుమతివ్వాలి
  • మూడు రోజుల్లోగా అనుమతులు మంజూరు చేయాలి
  • తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీజేఎస్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరామ్, పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించడం విదితమే. ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో టీజేఎస్ ఆవిర్భావ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని, మూడు రోజుల్లోగా అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో టీజేఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, హైదరాబాద్ నగరంలో టీజేఎస్ పార్టీ ఆవిర్భావ సభ పెడితే అక్కడికి వచ్చే వాహనాల పొగ కారణంగా కాలుష్యం పెరుగుతుందని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే, ఈ సభకు అనుమతివ్వడం లేదని పోలీస్ శాఖ ఇటీవల పేర్కొంది.
Kodandaram
High Court
tjs party

More Telugu News