vijayasai reddy: మరి, నేను కూడా విజయసాయిరెడ్డితో టచ్ లో ఉన్నా..!: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చమత్కారం

  • పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో నేనూ మాట్లాడతా
  • ‘బాగున్నారా విజయసాయిరెడ్డి గారు’ అని పలకరిస్తా
  • అయినంత మాత్రాన నేను వైసీపీలోకి వెళుతున్నట్టా?
  • టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్ లో ఉండటం కూడా అంతే!
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేను కూడా పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మాట్లాడతా. ‘బాగున్నారా విజయసాయిరెడ్డి గారు’ అని పలకరిస్తా.. ఎంపీలందరితోనూ మాట్లాడతా..వాళ్లతో కలిసి కాఫీ తాగుతా. యోగ క్షేమ సమాచారాల కోసం, కలిసి కాఫీ తాగడం కోసం వారితో టచ్ లో ఉంటాను. అలా అని చెప్పి..నేను వైసీపీలోకి వెళుతున్నానని ఎప్పడైనా చెప్పానా?

కనబడితే నమస్కారం పెడతాం, ’ఏమన్నా బాగున్నావా?’ అని అడుగుతాం. అయినంత మాత్రాన పార్టీ మారుతున్నట్టా? ఎమ్మెల్యేలు ఏమైనా తిక్కనాకొడుకులా..చాలా తెలివైన వాళ్లు! వైసీపీ లోకి టీడీపీ వాళ్లు వెళ్లి ఇప్పుడేం చేస్తారు? తెలుగుదేశం పార్టీ వాళ్లను జగన్ తీసుకుంటాడని తెలుసు. అర్హులు కాని వాళ్లకు, ప్రజలతో సంబంధం లేనటువంటి వాళ్లకు, అవినీతిపరులకు టికెట్లు ఇవ్వనని చంద్రబాబు నాయుడుగారు రోజూ చెబుతున్నారు. అప్పుడు, మాజీ ఎమ్మెల్యేలు కొందరు నీ (జగన్) దగ్గరకు వస్తారు నాయనా! వాళ్లకు టికెట్లు ఇవ్వు.. ఎవరొద్దన్నారు?’ అని జేసీ తన దైన శైలిలో మాట్లాడారు.
vijayasai reddy
jc diwakar reddyy

More Telugu News