anasuya: నెటిజన్ల విమర్శలపై ఘాటుగా స్పందించిన అనసూయ!

  • రంగస్థలం సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ
  • సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై ఘాటు స్పందన
  • వైవిధ్యభరితమైన పాత్రలు  చేయడంలో తప్పు లేదు
బుల్లితెర యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ రంగస్థలం సినిమాలో పల్లెటూరి కట్టుబొట్టుతో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టింది. అయితే సోషల్ మీడియాలో తనపై చాలా విమర్శలు వస్తున్నాయని ఓ ఇంటర్వ్యూలో అనసూయ చెప్పుకొచ్చింది. ఓవైపు యాంకర్‌‌లా టీవీల్లో కనిపించడం మరోవైపు ఐటమ్‌ సాంగ్స్‌ చెయ్యడం ఇద్దరు బిడ్డల తల్లివి అయినా నీకు అవసరమా? అని సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శల పట్ల అనసూయ ఘాటుగా స్పందించింది.

'ఇద్దరు బిడ్డల తల్లినైతే ఏంటి? బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్ లకు పెళ్లిళ్లవడమే కాకుండా, పిల్లలు కూడా వున్నారు. ఒకప్పటి అగ్ర తారలైన భానుమతిగారు, సావిత్రిగారు పెళ్లయిన తర్వాత కూడా కెరీర్‌లో అద్భుతంగా రాణించారు. అప్పుడులేని విమర్శలు ఇప్పుడు ఎందుకు? వైవిధ్యభరితమైన పాత్రలు వచ్చినపుడు చేయడంలో తప్పు లేదు' అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.
anasuya
Tollywood
Hyderabad
Telangana

More Telugu News