Bharath Ane Nenu: 'భరత్ అనే నేను' సినిమా కథ నాదే.. ఐడియా మాత్రం నా స్నేహితుడిది: కొరటాల శివ

  • నా స్నేహితుడు శ్రీహరి ఐడియా ఇచ్చాడు 
  • అద్భుతంగా ఉందని కథను డెవలప్ చేశాను
  • అతని పేరు కూడా టైటిల్స్ లో వేస్తున్నాం
ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమా కథ తనదేనని ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ తెలిపాడు. ఈ సినిమా కథ కొరటాల శివది కాదని, ఈ కథను వేరే వ్యక్తి రాయగా, కోటి రూపాయలకు దానిని కొని శివ తెరకెక్కిస్తున్నాడని కథనాలు వెలువడ్డాయి.

వాటిపై కొరటాల శివ క్లారిటీ ఇస్తూ, అవన్నీ పుకార్లని కొట్టిపడేశారు. తన స్నేహితుడు, కెరీర్‌ తొలినాళ్లల్లో రూమ్‌ మేట్‌ అయిన శ్రీహరి (దర్శకుడు) అప్పట్లో ఒక ఐడియా ఇచ్చాడని చెప్పాడు. ముఖ్యమంత్రి ముఖ్యపాత్ర అంటూ ఇచ్చిన ఆ ఐడియా తనకు అద్భుతంగా అనిపించిందని శివ తెలిపాడు. ఆ లైన్ ను తాను డెవలప్ చేసుకుని కథను సిద్ధం చేశానని ఆయన తెలిపాడు. అందుకే ఈ ఐడియా ఇచ్చిన నా స్నేహితుడికి స్పెషల్ ధ్యాంక్స్ ను టైటిల్స్ లో వేస్తున్నామని తెలిపాడు. 
Bharath Ane Nenu
Mahesh Babu
Koratala Siva

More Telugu News